
పామును చూస్తే చాలు చాలామంది ఆమడ దూరం పారిపోతారు. ఎవరైనా ధైర్యం ఉన్నవారు అయితే దాన్ని కొట్టి చంపేస్తారు. కానీ పాముకు ఆపరేషన్ చేసేవారిని ఎవర్నైనా చూశారా..? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అదే జరిగింది. పాముకు ఆపరేషన్ చేసి దాన్ని కాపాడాడు ఓ స్నేక్ క్యాచర్. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సింగరాయపాలెం గ్రామంలో ఈ ఘటన జరిగింది.
మాగాణిలో ఉన్న ఓ భారి తాచుపాము వరి కోత మిషన్‌లో పడి తీవ్రంగా గాయపడింది. అది అక్కడ్నుంచి కదల్లోక బాధతో విలవిల్లాడుతుంది. వరి కోత కోసి దాదాపు 5 రోజులు అవుతుంది. అది అప్పటి నుంచి ప్రాణాల కోసం పోరాడుతుంది. గాయంతో విలవిల్లాడుతున్న పామును చూసిన స్థానికులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ, వైద్యుడు రమేష్‌కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి దానికి ఆపరేషన్ చేశారు. అది కాస్త కోలుకున్న అనంతరం.. సురక్షత ప్రాంతంలో విడిచిపెట్టారు.
ఈ భూమి కేవలం మనుషులదే కాదు. అందరిదీ. అన్ని జీవులకు సమాన హక్కు ఉంటుంది. అందులో జంతువులు, పక్షులు, సరిసృపాలు కూడా భాగం. పాము కనపడగానే దాన్ని చంపకుండా.. వెంటనే స్నేక్ క్యాచర్ లేదా అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. పాము తనకు ఆపద అనుకున్నప్పుడు మాత్రమే కాటు వేస్తుంది అన్నది గుర్తుంచుకోండి.
Snake
మరిన్ని ఏపీ వార్తల కోసం..