కార్మికుల వినూత్న నిరసన

|

Sep 26, 2019 | 6:03 PM

కడప జిల్లాలో సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులు రోడ్డేక్కారు. చిలమకూర్ ఐ సి ల్ కార్మికులు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. గత కొన్నిరోజులుగా ఐసీఎల్‌ కార్మికులు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. రెండ్రోజుల కిందట శవయాత్ర నిర్వహించిన కార్మికులు..ఇవాళ భర్త చనిపోతే విధవను చేయడం లాంటి కార్యక్రమం చేపట్టారు.. అంతేకాదు పిండప్రదానం చేస్తూ….తమదైన శైలిలో యాజమాన్యంపై నిరసన వ్యక్తం చేశారు కార్మికులు. కార్మికులంతా కలిసి ఓ వ్యక్తికి ఆడవేశం వేసి…పిండప్రదానం కార్యక్రమం చేపట్టారు. రోడ్డు వెంట […]

కార్మికుల వినూత్న నిరసన
Follow us on

కడప జిల్లాలో సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులు రోడ్డేక్కారు. చిలమకూర్ ఐ సి ల్ కార్మికులు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. గత కొన్నిరోజులుగా ఐసీఎల్‌ కార్మికులు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. రెండ్రోజుల కిందట శవయాత్ర నిర్వహించిన కార్మికులు..ఇవాళ భర్త చనిపోతే విధవను చేయడం లాంటి కార్యక్రమం చేపట్టారు.. అంతేకాదు పిండప్రదానం చేస్తూ….తమదైన శైలిలో యాజమాన్యంపై నిరసన వ్యక్తం చేశారు కార్మికులు. కార్మికులంతా కలిసి ఓ వ్యక్తికి ఆడవేశం వేసి…పిండప్రదానం కార్యక్రమం చేపట్టారు. రోడ్డు వెంట ఊరేగిస్తూ…ఏడుపులు పెడబొబ్బులు పెడుతూ విధవను చేసేందుకు చెరువుగట్టుకు తీసుకెళ్లారు. తలబాదుకుంటూ ఆడవేషంలో ఉన్న వ్యక్తి తమ డిమాండ్లను ఏడుపు రూపంలో చెబుతూ నిరసన వ్యక్తం చేస్తాడు. మహిళా వేషధారణలో ఉన్న వ్యక్తికి గాజులు తొడిగి …పగుల గొట్టి విధవను చేస్తూ…తాము పడుతున్న కష్టాలను చెప్పుకొచ్చారు కార్మికులు. గత మూడు నెలలుగా పలు రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నా యాజమాన్యంలో చలనం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూడునెలల నుంచి తమకు ఈపీఎఫ్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యాలను కల్పించలేడం లేదంటూ కార్మిక సంఘ నేతలు మండిపడుతున్నారు. వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చకుంటే…ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.