Andhra Pradesh: కోనసీమ కొత్త కోడలికి అద్దిరిపోయే కానుక.. నిశ్చితార్థంలోనే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుందో మరీ..!

Konaseema district: స్వీట్స్ లో 108 వెరైటీలు మాత్రమే కాకుండా ఇంట్లో వాడుకలో ఉండే వస్తువుల రూపంలో తయారు చేసి స్వీట్స్ ప్రత్యేకంగా అందర్నీ ఆకర్షించాయి. కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు లతో పాటు గోదావరి జిల్లాలో ఫేమస్ స్వీట్స్ రకాలు పెళ్లి కూతురికి ఇచ్చారు. వీటితో పాటు కూరగాయలు, పాత తరం నాటి

Edited By:

Updated on: Sep 05, 2023 | 1:32 PM

గోదావరి జిల్లాలు అంటే సంప్రదాయాలకు పెట్టిన పేరు అలాంటి గోదావరి జిల్లాలో అర్చర్యపరిచే కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. సంప్రదాయాలతో పాటు అరుదైన రికార్డులు సాధించడం వారికి అలవాటే. అందులో భాగంగా రాజమండ్రిలో జరిగిన ఓ నిచ్చాయతంభుల కార్యక్రమంలో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు తరపున పెట్టిన స్వీట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. పది కాదు ఇరవై కాదు ఏకంగా 108 రకాల స్వీట్స్ పెళ్ళికూతు తరుపున వారికి పెట్టీన స్వీట్స్ చర్చనీయాంశంగా మారింది…. రాజమండ్రి మజిరా హోటల్ లో జరిగిన మున్నం, ప్రగడ కుటుంబాల ఎంగేజ్మెంట్ లో ఈ స్వీట్స్ దర్శనం ఇచ్చాయి.

స్వీట్స్ లో 108 వెరైటీలు మాత్రమే కాకుండా ఇంట్లో వాడుకలో ఉండే వస్తువుల రూపంలో తయారు చేసి స్వీట్స్ ప్రత్యేకంగా అందర్నీ ఆకర్షించాయి. కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు లతో పాటు గోదావరి జిల్లాలో ఫేమస్ స్వీట్స్ రకాలు పెళ్లి కూతురికి ఇచ్చారు. వీటితో పాటు కూరగాయలు, పాత తరం నాటి రుబ్రోలు పొత్రాలు స్వీట్స్ రూపంలో చేయడమే కాకుండా పండ్లు రూపంలో తయారుచేసిన స్వీట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us