ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి జయరామ్‌కు మరోసారి నిరసన సెగ తగిలింది. గడపగడపకూ వైసీపీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లిన మంత్రిని మహిళలు చుట్టుముట్టి, సమస్యలపై నిలదీశారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతోన్న మంత్రి గుమ్మనూరు జయరామ్ (Minister Jayaram) కు ప్రజలు పట్టపగలే చుక్కలు చూపించారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో మినిస్టర్ జయరామ్‌ను మహిళలు అడ్డుకున్నారు. మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మంత్రి జయరామ్‌ను చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. తమకు ఇచ్చిన హామీల సంగతి ఏమైందని ప్రశ్నించారు. కేవలం, హామీలేనా? నెరవేర్చే ఉద్దేశం ఉందా? అంటూ ప్రశ్నించడంతో గడపగడపకూ ప్రోగ్రామ్‌లో రగడ జరగింది. ఎన్నికల టైమ్‌లో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి, ఇప్పుడు గాలికొదిలేశారంటూ నిలదీశారు.
తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేయడంతో గ్రామసభలో రభస జరగింది. రోడ్లు, డ్రైనేజీలపై నిలదీశారు మహిళలు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ పెట్టించాలని డిమాండ్ చేశారు. రోడ్లు దారుణంగా ఉన్నాయని, వెంటనే కొత్త రోడ్లు వేయాలని కోరారు. గ్రామస్తుల ప్రశ్నలతో మంత్రి జయరామ్ ఉక్కిరిబిక్కిరయ్యారు. గ్రామస్తులు చెప్పివన్నీ విన్న జయరామ్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్‌ను వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి