
పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన అనంతరం పోలీసు డిపార్ట్‌మెంట్‌లో రెండో అదనపు ఎస్పీగా ఎల్.నాగేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. అయితే కుర్చీ ఎక్కిన 24 గంటల్లోనే ఆమె రిటైర్ అవ్వనున్నారు. 1989 బ్యాచ్‌లో ఎస్సైగా పోలీస్ శాఖలోకి వచ్చిన ఈమె వివిధ హోదాలను అందుకున్నారు. ఇటీవలే DSP నుంచి ASPగా ప్రమోషన్ పొందారు. రిటైర్ అయ్యే సమయానికి ఏదో ఒక ప్రాంతంలో విధుల్లో ఉండాలనే రూల్‌ను అనుసరించి ఆమెకు పార్వతీపురం అదనపు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. గురువారం సంబధిత ఫైల్‌పై సైన్ చేసి చార్జ్ తీసుకున్న ఆమె.. శుక్రవారం సాయంత్రానికి రిటైర్ట్ ASP అయిపోనున్నారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే అదనపు ఎస్పీగా ఆమె రిటైర్ అవ్వున్నారు
ఎల్.నాగేశ్వరి తండ్రి కూడా పోలీసు శాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు. నాగేశ్వరి చిన్నతనంలో విద్యాభ్యాసం పార్వతీపురంలోనే మెదలైంది. పట్టణంలోని బాలికల ఆర్సీఎం స్కూల్లో ఐదో తరగతి వరకు చదివారు. తర్వాత బొబ్బిలి సీబీఎం స్కూల్లో టెన్త్ కంప్లీట్ చేశారు. తదుపరి విజయనగరంలో ఇంటర్మీడియట్, డిగ్రీ కంప్లీట్ చేశారు. 1989లో ఎస్సైగా సెలక్ట్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆమె ఎక్కువకాలం తెలంగాణలో సేవలు అందించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆమె ఏపీలో పనిచేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి