విజయవాడ,అక్టోబర్25; విజయవాడ కంకిపాడులోని మణపురంలో బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న పావని అనే యువతి చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడివాడ రూరల్ లింగవరం గ్రామానికి చెందిన పావని పెళ్లైంది. భర్త కూడా ఉన్నాడు.. గౌరవపరమైన చక్కటి ఉద్యోగం.. పిల్లాపాపలతో హాయిగా గడపాల్సిన ఈమె నెత్తిన శని తాండవించిందో ఏమో కానీ.. కొంతకాలం కిందట భర్తతో గొడవపడి వేరే కాపురం పెట్టింది. తరువాత కంకిపాడు మణ్ణపురం బ్రాంచ్‌కి బదిలీ చేయించుకొని ప్రస్తుతం బ్రాంచ్ మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తుంది. ఇటీవల పావని కృత్తివెన్నుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అతడు గతంలో ప్రైవేట్ స్కూల్ నడిపి అప్పుల పాలైనట్టుగా తెలిసింది. దీంతో అతడు ఓ పథకం పన్నాడు.. పావని పని చేస్తున్న ఆ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో ఖాతాదారులు కుదువ పెట్టిన 10 కిలోల 600.60 గ్రాముల బంగారు ఆభరణాలు కొట్టేయాలని ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు… ఆ బంగారాన్ని అమ్ముకొని దేశం విడిచి వెళ్లిపోయి ..ఎక్కడైనా ఇద్దరం కలిసి హాయిగా బతకాలని నిర్ణయించుకున్నారు.. వారం రోజుల క్రితం ఈనెల 16న బ్రాంచ్‌కి సిబ్బంది కంటే ముందే వెళ్ళిపోయిన పావని.. సేఫ్ లాకర్ లో ఉండే ఆరు కోట్లు విలువైన బంగారం ఓ బ్యాగ్ లో సర్దేసుకొని దర్జాగా బయటకు వెళ్ళిపోయింది..
అనంతరం సిబ్బంది టైంకి వచ్చారు.. మేడం లీవ్ పెట్టింది అనుకున్నారు.. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో బిజీగా ఉంది అనుకున్నారు.. ఆ తర్వాత లాకర్ దగ్గరికి వెళ్లి చూడగా బంగారం తీసేసి ఉండటం అందులో ఒక్క తులం కూడా బంగారం లేకపోవడం చూసి సిబ్బంది కంగుతున్నారు.. వెంటనే బ్రాంచ్ యాజమాన్యన్నీ సంప్రదించి పోలీసులకు సమాచారాన్ని అందించారు..
10 కిలోల బంగారంతో ఉడాయించిన మేనేజర్ పావని.. కొట్టేసిన బంగారంలో ఆరు కిలోలు లవర్ దగ్గర పెట్టి.. మరో నాలుగున్నర కిలోల బంగారాన్ని తన బ్యాగ్ లో పెట్టుకుంది. తన సెల్ ఫోన్ ఇంట్లో పడేసి తన బంధువులు షిరిడి వెళ్తున్నారని తెలిసి బాబా దర్శనం కోసం నేను కూడా షిరిడీ వస్తానంటూ..వారితో కలిసి షిరిడీ పయనమైంది.. పావని బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళటం.. బ్యాంకులోని, సమీపంలోని సిసి కెమెరాల్లో రికార్డు అయింది.. ఇంటికి వెళితే తాళం వేసి ఉంది.. దీంతో జరిగిందంతా పోలీసులకు అర్థం అయింది.. పోలీసులు వెంటనే పావని బంధువుల ఫోన్ నెంబర్లను సేకరించారు.. వాటిపై నిఘా పెట్టిన పోలీసులు.. షిరిడీ నుంచి తన లవర్ తో బంధువుల ఫోన్ నుంచి మాట్లాడుతున్నట్లు పసిగట్టారు.. సిగ్నల్ ఆధారంగా షిరిడీ చేరుకున్న పోలీసులు.. కిలాడీ లేడీని పట్టుకొని కంకిపాడు పీఎస్ కి తరలించారు.. జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బంగారం కొట్టేయడంలో పావని కి డైరెక్షన్ ఇచ్చిన యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.. దేశం కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పట్టుబడి పోతామని తెలిసికూడా ఏకంగా ఆరు కోట్లు విలువైన బంగారాన్ని ఎలా కొట్టేసిందో అని ఆశ్చర్య పోతున్నారు ఈ విషయం తెలిసిన ప్రతిఒక్కరూ… ఈ చోరీ కేసులో పావని తో పాటు ఇంకా ఎవరెవరూ ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..