Andhra News: ఏపీలో వారికి గుడ్ న్యూస్.. తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

ఏపీ ప్రజలకు మంత్రి నారా లోకేష్ గుడ్‌ న్యూస్ చెప్పారు. రాబోయే రెండు నెల్లలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గోన్న మంత్రి నారా లోకేష్‌ ఈ ప్రకటన చేశారు.

Andhra News: ఏపీలో వారికి గుడ్ న్యూస్.. తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?
Lokesh

Updated on: May 08, 2025 | 8:48 AM

బుధవారం సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గోన్న మంత్రి నారా లోకేష్‌ ఏపీ వాసులకు మరో గుడ్‌ న్యూస్ చెప్పారు. రాబోయే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మన కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం 75 ఏళ్ల వయసులో అహర్నిశలు కష్టపడుతున్న సీఎం చంద్రబాబుకు అండగా నిలబడేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన అన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం మద్దతిస్తుందని ఆయన అన్నారు.

తోట చంద్రయ్య, అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి..

యువగళం పాదయాత్ర సందర్భంగా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని. గత ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురిచేసినా.. బెదరకుండా ఎదరు నిలిచిన పోరాడిన అంజిరెడ్డి, జులారెడ్డి, తోట చంద్రయ్య వంటి వారే తనకు స్ఫూర్తి అని మంత్రి లోకేష్‌ అన్నారు.

10 నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం..

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 10 నెలల పాలనలోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెన్షన్లు అందిస్తున్నామని ఆయన అన్నారు. వృద్ధులకు రూ.4వేలు పెన్షన్, వికలాంగులకు రూ.6వేలు పెన్షన్, ఆనారోగ్యంతో బాధపడుతున్న వారికి రూ.15వేలు పెన్షన్ ఇవ్వడం ఒక్క ఏపీలోనే జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్తరేషన్‌ కార్డులు పంపిణీ ప్రారంభిస్తామని ఆయన అన్నారు. జూన్‌లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని.. జులలో వాటిని పంపిణీ కార్యక్రమం చేపడతామని ఆయన అన్నారు. వచ్చే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం కార్యక్రమాలు అమలుచేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

ప్రధాని మన కోరికలు నెరవేరుస్తున్నారు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పడిందని.. ప్రధాని మన అన్ని కోరికలు నెరవేరుస్తున్నారని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వలేదు. మనం అమరావతి కడుతున్నాం.. మనమే అమరావతి కడుతున్నాం అని మొన్నటి సభలో ప్రధాని వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు పవన్‌ కృషిచేస్తున్నారని తెలిపారు. మనకోసం, మన పిల్లల భవిష్యత్ కోసం 75 ఏళ్ల వయసులో చంద్రబాబు పనిచేస్తున్నారు. ఆయనకు అండగా నిలిచేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మంత్రి లోకేష్‌ ఈ సందర్భంగా మాట్లాడారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..