ఏ కేసు లింక్ అయినా అక్కడికే వెళ్తుంది.. ఏ క్రైమ్ స్టోరీ లోతుల్లోకి వెళ్లినా ఆ వ్యవహారమే అని తేలుతుంది. ఇంకేంటి.. వివాహేతర సంబంధం.. ఇల్లీగల్ అఫైర్.. అవును.. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇలాంటి క్రైమ్ స్టోరీనే వెలుగుచూసింది. భర్త దగ్గర పనిచేసే వ్యక్తితోనే అఫైర్ పెట్టుకున్న ఓ మహిళ.. చివరికి భర్తనే అంతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. నందిగామ(Nandigama) ఎక్సైజ్ కాలనీ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మేకల శివకుమార్ హత్య కేసులో నిందితులను పట్టేశారు పోలీసులు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే తాపీ మేస్త్రి శివ కుమార్ ను వేముల అంకమ్మరావు హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తు ద్వారా నిర్ధారించారు. ఇందుకు మృతుడి భార్య మాధవి కూడా హెల్ఫ్ చేసినట్లు తేలింది. ఈ నెల 5న ఎక్సైజ్ ఆఫీస్ సమీపంలో తాపీ మేస్త్రి శివకుమార్ హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. దీనిపై శివ కుమార్ భార్య మాధవి ఇచ్చిన పోలీసులకు కంప్లైంట్ చేసింది. విచారణ చేపట్టని పోలీసులు బి.సి.కాలనీకి చెందిన వేముల అంకమ్మరావు, యాదవ బజారుకు చెందిన ఉప్పుతోళ్ళ గోవర్ధన్ రావు కలసి ఈ మర్డర్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో శివకుమార్ భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న అంకమ్మ రావు ప్రధాన ముద్దాయి కాగా, మృతుడి భార్య మూడో ముద్దాయని అని నిర్ధారణకు వచ్చారు.
ఈ కేసు విచారణలో దిమ్మతిరిగే వెలుగుచూశాయి. ఈనెల 6వ తేదీన శివకూమర్ హత్యకు గురయ్యాడు. శివ కుమార్ హత్య అనంతరం అంకమ్మరావు మృతుని భార్యతో ఫోన్ లో మాట్లాడాడు. అక్కడే పోలీసులకు లీడ్ దొరికింది మృతుని భార్యతో అంకమ్మరావుకు ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. ప్రియుడితో కలిసి భర్తను భార్యే హత్య చేయించినట్లు గుర్తించారు. ఇలా అక్రమ సంబంధం మరో వ్యక్తి హత్యకు కారణమైంది.