
అఘోరీ.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. ఈ మనిషీ బాగా కనిపిస్తోంది. తెలుగునాట ఎక్కడ చూసినా ఈమె గురించే చర్చ. ఇక నెట్టింట.. ఆమె గురించే రచ్చ. సాధారణంగా అఘోరాలు.. జన జీవనంలోకి రారు. పబ్లిసిటీ కోరుకోరు. మరి ఈవిడెందుకు వచ్చింది? అసలు వాళ్ల లైఫ్ స్టైలే సెపరేట్ గా ఉంటుంది. భౌతిక సుఖాలను పూర్తిగా వదిలేస్తారు. మరి ఈ అఘోరీ ఎందుకు.. ఓ మామూలు మనిషిలా జీవిస్తున్నట్టుగా కనిపిస్తోంది? కారులో తిరుగుతోంది. ఖరీదైన సౌకర్యాలూ ఉన్నాయి. అదే స్థాయిలో వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. ఇప్పటివరకు అఘోరాల గురించి విన్నదానికి, చూసినదానికి.. ఇక్కడ ఈమె ప్రవర్తనకు అసలు ఎక్కడా పొంతనే కనిపించదు. పెట్రోల్ పోసుకుంటానంటుంది. ఆత్మహత్యకు చేసుకుంటానంటుంది. కారుతో నదిలోకి వెళ్లి సూసైడ్ ప్రయత్నం చేస్తుంది. ఆగ్రహంతో రగిలిపోతుంది. ఆవేదనతో కుంగిపోతుంది. అసలు.. అఘోరాలకు ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయా? వాళ్ల జీవితంలో ఇన్ని యాక్షన్స్ సీన్స్ కు చోటుందా? ఈవిడను చూస్తే.. అఘోరీలు ఇలా ఉంటారా అన్న అనుమానం కూడా వస్తుంది. ఇంతకీ.. అఘోరీల జీవనవిధానం ఎలా ఉంటుంది? వారి రోజువారీ జీవితం ఎలా గడుస్తుంది? మరి ఈ అఘోరీ మాత ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ మాత ఇప్పుడో సెలబ్రెటీ. ఆమె వెళ్లినచోటల్లా తనను చూడడానికి స్థానికులు ఎగబడుతున్నారు. సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడుతున్నారు. దీంతో ఆమెకు క్రేజ్ పెరిగింది. దానికి...