AP Rains: రెయిన్ అలెర్ట్..! వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

మాడుపగిలే ఎండల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఏపీకి వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి వాతావరణ శాఖ ఇచ్చిన ఆ సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి ఈ ఆర్టికల్ చూసేయండి.

AP Rains: రెయిన్ అలెర్ట్..! వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
Ap Rains

Updated on: Apr 21, 2025 | 1:49 PM

ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-
—————————————-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురుగాలులు గంటకు 30-40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
——————————–

ఈరోజు, రేపు, ఎల్లుండి:-
—————————————-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కిమీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:-
——————-

గమనిక:- కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో రాగాల 5 రోజుల్లో వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణంతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశముంది తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశముంది.