AP Weather: మరో 2 రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు.. వాతావరణ కేంద్రం రిపోర్ట్ ఇదే

|

Nov 03, 2022 | 2:09 PM

ఈశాన్య రుతుపవనాల సీజన్‌ ప్రారంభమైంది. మరోవైపు బంగాళాఖాతంలో ఆవర్తనం చురుగ్గా కదులుతుంది. దీంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

AP Weather: మరో 2 రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు.. వాతావరణ కేంద్రం రిపోర్ట్ ఇదే
AP Weather Report
Follow us on

ఏపీలోని పలు ప్రాంతాల్లో 2,3 రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ రెయిన్స్ కంటిన్యూ అవ్వనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో గల ఉపరితల ఆవర్తనం.. సగటు సముద్ర మట్టము నుంచి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈశాన్య రుతుపవనాలు కూడా యాక్టివ్‌గా ఉన్నాయి. వీటి ప్రభావంతో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు.. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములతో కూడిన జల్లులు.. ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల.. రాయలసీమలో అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములతో కూడా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంబంవించే చాన్స్ ఉన్నట్లు తెలిపింది.

ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు,  నెల్లూరు, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అలెర్ట్‌గా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడుతున్నాయి.

వర్షాల నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది. వర్షం పడుతున్న సమయంలో పొలాలకు వెళ్లిన రైతు కూలీలు, రైతు వృక్షాల కింద నిల్చోవద్దని కోరింది. కరెంట్ స్తంభాలు వంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. తెగుతాయని భావిస్తున్న కాలవ కట్టలు, చెరువుల నుంచి దూరంగా వెళ్లాలని సూచించింది.

మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.