Weather Report: బంగాళాఖాతంలోని నిన్నటి తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలహీనపడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర ఛత్తీస్ ఘడ్ దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఇంటీరియర్ ఒడిస్సాలలో ఝర్సుగుడాకి పశ్చిమ వాయువ్య దిశగా 80 కి.మి దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. దీని ప్రభావం వల్ల రాగల 48 గంటలలో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఛత్తీస్ ఘడ్ ఇంకా, మధ్యప్రదేశ్ మీదగా ప్రయాణించి, బలహీనపడి తీవ్ర పీడనంగా మారే అవకాశం ఉందని చెప్పింది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి:
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం:
ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర:
ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.