Rain Alert: కూల్ న్యూస్.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. పగలు ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. అంతేకాకుండా ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు సైతం కురుస్తున్నాయి.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాబోవు మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Rain Alert: కూల్ న్యూస్.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Ap Rain Alert

Updated on: May 11, 2025 | 2:53 PM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. పగలు ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. అంతేకాకుండా ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు సైతం కురుస్తున్నాయి.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాబోవు మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర-దక్షిణ ద్రోణి మరాఠ్వాడ నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర కర్ణాటక – తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది.

నైరుతి రుతుపవనాలు తేదీ మే 13,2025 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇవి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు & కొమోరిన్ ప్రాంతం; దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మొత్తం అండమాన్ & నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం; మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల మీదుగా తదుపరి 4-5 రోజుల్లో విస్తరించే అవకాశం ఉంది. నిన్నటి దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనము ఈరోజు బలహీన పడినది. ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, దక్షిణ గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచనలు :

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 50-60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ :-

ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

గమనిక :-

కోస్తా ఆంధ్ర ప్రదేశ్ – యానంలో రానున్న 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేదు తరువాత 3 రోజుల్లో స్వల్పముగా పెరిగే అవకాశముంది. రాయలసీమలో రానున్న 7 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..