
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటికే రుతుపవనాలు విస్తరించాయి. దీంతోపాటు ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి కూడా కొనసాగుతోంది. ఈనెల 15 నుంచి ఏపీలో రుతుపవనాలు మరింత బలపడి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. రుతు పవనాల ప్రభావం.. ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.
ఋతుపవనాల ఉత్తర పరిమితి నవ్‌సారి, జలగావ్, అమరావతి, చంద్రపూర్, బీజాపూర్, సుక్మా, మల్కన్‌గిరి, విజయనగరం, ఇస్లాంపూర్ గుండా వెళుతున్నది. నైరుతి రుతుపవనాలు తదుపరి 3 – 4 రోజులలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
తెలంగాణ నుండి కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీదుగా బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ & 5.8 కి.మీ ఎత్తులో ద్రోణి వ్యాపించి ఉన్నది. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ & 5.8 కి.మీ మధ్య 17°N వెంబడి ఉన్న ద్రోణి / షీర్ జోన్ బలహీన పడినది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
గురువారం : తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
శుక్రవారం -శనివారం: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
గురువారం: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
శుక్రవారం -శనివారం : తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-
గురువారం, శుక్రవారం -శనివారం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..