Andhra Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలెర్ట్. రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా రాయలసీమ(Rayalaseema)లో జోరు వానలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే కుండపోత వానలతో రాయలసీమ తడిసి ముద్దవుతోంది. డ్యామ్‌లు నిండుకుండల్లా మారాయి. భారీ వర్షాలతో శ్రీశైల ప్రాజెక్టు(srisailam project)కు భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ 4గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులకు పైగా ఉండగా, ఔట్‌ఫ్లో 63,799 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ నీటిమట్టం పూర్తిస్థాయికి 885 టీఎంసీలకు చేరింది. కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. సుంకేశుల బ్యారేజ్‌కు వరద ఉధృతి పెరగింది. దీంతో 13 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. 28గేట్లు ఎత్తి 90వేలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 1633 అడుగులు కాగా..ప్రస్తుతం 1631అడుగులకు చేరింది నీటిమట్టం.
తెలంగాణకు రెడ్ అలెర్ట్…
తెలంగాణకు రెడ్ అలర్ట్ వచ్చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం..రానున్న 12గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశముంది. దీని ప్రభావంతో ఈ నెల 9వరకు హెవీ రైన్స్ పడతాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..