
ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణము లో ఆగ్నేయ / నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–
బుధవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గరిష్ట ఉష్ణో గ్రతలు సగటు ఉష్ణో గ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటి గ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది .
గురువారం, శుక్రవారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణో గ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటి గ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది .
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
బుధవారం, గురువారం, శుక్రవారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటి గ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది .
రాయలసీమ :-
బుధవారం, గురువారం, శుక్రవారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటి గ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం