AP Weather Alert: ఏపీ వాసులకు ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చే చల్లటి కబురును అమరావతి వాతావరణ శాఖ చెప్పింది. నేటి నుంచి 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి గాలులు వీస్తున్నాయి. తత్ఫలితంగా రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు ,రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ: ఈరోజు ,రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఉరుములు లేదా మెరుపులు తో కూడిన ఈదురు గాలులు 3౦నుండి 40 కి మీ వేగము తో ఒకటి లేక రెండు చోట్ల సంభవించే అవకాశము ఉంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
అయితే ఈ అకాల వర్షలతో అన్నదాతకు నష్టాలు తప్పవని ఆందోళలన వ్యక్తమవుతోంది.
Also Read:Sreeja Konidela: వైరల్‌గా మారిన చిరంజీవి కూతురు పోస్ట్.. ఎదుటి వారికి ఏది ఇస్తే అదే వస్తుందంటూ..