రాయలసీమ నుంచి తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా దక్షిణ జార్ఖండ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఈదురు గాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. కృష్ణా, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, ఏలూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షం కురిసింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–
—————————–
శని ఆదివారాలు : తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
———————–
శని ఆదివారాలు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది
రాయలసీమ :-
—————-
శని ఆదివారాలు :- తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
కాగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఏపీలోని ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, అరటి, మొక్కజొన్న రైతులను అకాల వర్షం బాగా దెబ్బతీసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..