Andhra Pradesh: ఏపీలో పిడుగులతో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు పడే అవకాశం.. 4 రోజులు జాగ్రత్త!

|

Apr 29, 2023 | 10:30 AM

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అటు కొన్ని జిల్లాల్లోని..

Andhra Pradesh: ఏపీలో పిడుగులతో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు పడే అవకాశం.. 4 రోజులు జాగ్రత్త!
Ap Rains
Follow us on

మాల్దీవుల నుంచి మధ్య మహారాష్ట్ర వరకు, కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అలాగే సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అటు కొన్ని జిల్లాల్లోని అక్కడక్కడ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. చెట్ల కింద నిలబదవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అధికారులు. రైతులు కూడా వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ద్రోణీ ప్రభావంతో రాష్ట్రంలో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నారు అధికారులు. మరోవైపు శనివారం ఉత్తరాంధ్ర, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాల్లో శనివారం, ఆదివారం తెల్లవారు జామున మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో శనివారం సాయంత్రం.. కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురవనున్నాయి. ఇక విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొంది వాతావరణ శాఖ.