Andhra Pradesh: అనకాపల్లిలో డ్యాన్సర్ల ఓవరాక్షన్‌.. స్టేజిపైనే కోడి తలను కొరికి, రక్తం తాగిన వైనం! వీడియో

|

Jul 13, 2024 | 11:31 AM

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో వింత సంఘటన చోటు చేసుకుంది. విష్ణు ఎంటర్‌టైన్‌మెంట్ అనే డ్యాన్స్‌ ట్రూప్‌ చేసిన డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌ వివాదానికి దారి తీసింది. కాంచన మువీ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తున్న డ్యాన్స్ గ్రూప్‌లోని ఒకరు.. పర్ఫామెన్స్‌ మధ్యలో బతికున్న కోడి తలను నోటితో అమాంతం కొరికి నానాయాగి చేశాడు. దీనితో వారిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు నమోదైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది..

Andhra Pradesh: అనకాపల్లిలో డ్యాన్సర్ల ఓవరాక్షన్‌.. స్టేజిపైనే కోడి తలను కొరికి, రక్తం తాగిన వైనం! వీడియో
Dancer Bites Off Live Hen's Head During Performance
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో వింత సంఘటన చోటు చేసుకుంది. విష్ణు ఎంటర్‌టైన్‌మెంట్ అనే డ్యాన్స్‌ ట్రూప్‌ చేసిన డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌ వివాదానికి దారి తీసింది. కాంచన మువీ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తున్న డ్యాన్స్ గ్రూప్‌లోని ఒకరు.. పర్ఫామెన్స్‌ మధ్యలో బతికున్న కోడి తలను నోటితో అమాంతం కొరికి నానాయాగి చేశాడు. దీనితో వారిపై కేసు నమోదు నమోదైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో డ్యాన్స్‌ ప్రదర్శన సమయంలో ఎర్ర చీర కట్టుకున్న డ్యాన్సర్‌ వేదికపైనే బతికున్న కోడిని చేతిలో పట్టుకుని.. క్షణాల్లో దాని తలను కొరికి విసిరేస్తాడు. అనంతరం కోడి శరీరం నుంచి కారిన బ్లడ్‌ను తాగి.. నోటి ద్వారా దాన్ని గాల్లోకి స్ప్రే చేయడం వీడియోలో కనిపిప్తుంది. ఈ అమానుష చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో జంతు ప్రేమికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ డ్యాన్స్‌ చూసేందుకు పిల్లలతో సహా అన్ని వయసుల ప్రేక్షకులు వచ్చారు. వారందరి ముందు కోడిని అత్యంత కౄరంగా చంపడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. పలువురు ఫిర్యాదు చేయడంతో సదరు డ్యాన్స్‌ ట్రూప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం, 1960లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెటా (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) అమలు చేసే ఈ చట్టం జంతువులను హింసించడాన్ని నిషేధిస్తుంది. డ్యాన్స్‌ సమయంలో ప్రేక్షకుల ముందు బహిరంగంగా కోడిని అత్యంత కౄరంగా చంపడం దుమారం లేదపింది. ఈ సంఘటన అనకాపల్లిలో జూలై 6వ చోటు చేసుకుంది.

మరిన్ని ట్రెండింగ్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.