AP News: దర్జాగా వచ్చి బైక్ దొంగలించారు.. కట్ చేస్తే.. కొద్దిదూరం వెళ్లగానే సీన్ సితారయ్యింది..

ఎట్లా ఉండాలని దొంగతనం చేయడమంటే.. బనీనుకు తెలియకుండా డ్రాయర్‌ను లాగేయాలి.. ఎక్కడో విన్నట్టు ఉందిగా ఈ డైలాగు. 64 కళల్లో చోరకళ కూడా ఒకటి. ఈ ఆర్ట్‌లో ఆరితేరిన వారే.. కనీసం ఒంటికి తెలియకుండా.. ఒంటి మీదున్నవన్నీ వలిచేస్తుంటారు. ఈ దొంగలు కూడా చాలా ఆరితేరినవాళ్లు.

AP News: దర్జాగా వచ్చి బైక్ దొంగలించారు.. కట్ చేస్తే.. కొద్దిదూరం వెళ్లగానే సీన్ సితారయ్యింది..
Representative Image
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 16, 2024 | 3:47 PM

ఎట్లా ఉండాలని దొంగతనం చేయడమంటే.. బనీనుకు తెలియకుండా డ్రాయర్‌ను లాగేయాలి.. ఎక్కడో విన్నట్టు ఉందిగా ఈ డైలాగు. 64 కళల్లో చోరకళ కూడా ఒకటి. ఈ ఆర్ట్‌లో ఆరితేరిన వారే.. కనీసం ఒంటికి తెలియకుండా.. ఒంటి మీదున్నవన్నీ వలిచేస్తుంటారు. ఈ దొంగలు కూడా చాలా ఆరితేరినవాళ్లు. బైకులు దొంగతనం చేయడంలో ఆరి తేరిపోయారు. పదుల సంఖ్యలో బైకులను ఎంతో చాకచక్యంగా కొట్టేశారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ వచ్చింది. ఈ ఇద్దరు దొంగలు.. తమ దగ్గర ఉన్న తాళాలతో బైక్ స్టార్ట్ చేశారు. కానీ వెళ్తూ.. వెళ్తూ.. అందులో పెట్రోల్ ఉండే.. లేదో.. చూసుకోవడం మర్చిపోయారు. అంతే.! మధ్యలోని బైక్ ఆగిపోయింది.. స్థానికుల చేతికి చిక్కారు. చావు దెబ్బలు తిన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి గ్రామంలో ద్విచక్ర వాహనాన్ని దొంగలించి పారిపోతున్న ఇద్దరు దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు. బైక్ దొంగతనం చేసి దొరికిపోయిన ఇద్దరు దొంగలను విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు గ్రామస్తులు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అర్ధరాత్రి కదిరిలో ద్విచక్ర వాహనం దొంగిలించి పారిపోతుండగా పులగంపల్లి వద్ద పెట్రోల్ అయిపోవడంతో దొంగలు దొరికిపోయారు. పెట్రోలు అయిపోయిన బైక్ను దోచుకుంటూ వెళుతున్న దొంగల తీరు అనుమానాస్పదంగా ఉండడంతో.. ఆ ఇద్దరు దొంగలను పట్టుకుని స్తంభానికి కట్టేసి నాలుగు తగిలిస్తే గ్రామస్తులకు అసలు విషయం చెప్పారు.

బైకు దొంగతనం చేసి పారిపోతుండగా పెట్రోల్ అయిపోవడంతో దొరికిపోయారని తెలియడంతో.. పోలీసులకు పని తగ్గింది అనుకున్నారు. దొంగతనం చేసేటప్పుడే పక్కా ప్లాన్, స్కెచ్ వేసుకొని వెళ్లే ఈ కుర్ర దొంగలు.. పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా.? ఇప్పటి నుంచి బైకు దొంగతనాలు అరికట్టాలంటే.. బైక్‌లో పెట్రోల్ లేకుండా చేస్తే చాలు దొంగలు ఇట్టే దొరికిపోతారు అని నవ్వుకుంటున్నారు ఇది తెలిసిన వాహనదారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles