Rent For Field: పంట పండించుకోవడానికి రైతు కావలెను.. పొలం కౌలుకివ్వబడును.. వెలసిన ఫ్లెక్స్

Rent For Field: సాధారణంగా ఇళ్ళు అద్దెకివ్వడం, షాపులు, గోడౌన్లు లీజుకివ్వడం వంటి బోర్డులు చూస్తుంటాం... ఇప్పుడు ఆ విభాగంలోకి పొలం కౌలుకివ్వబడును కూడా చేరింది. వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య..

Rent For Field: పంట పండించుకోవడానికి రైతు కావలెను.. పొలం కౌలుకివ్వబడును.. వెలసిన ఫ్లెక్స్
Polam Koulu

Updated on: Apr 24, 2022 | 9:39 AM

Rent For Field: సాధారణంగా ఇళ్ళు అద్దెకివ్వడం, షాపులు, గోడౌన్లు లీజుకివ్వడం వంటి బోర్డులు చూస్తుంటాం… ఇప్పుడు ఆ విభాగంలోకి పొలం కౌలుకివ్వబడును కూడా చేరింది. వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. నష్టాలే వస్తుండటంతో కౌలు రైతులు(Koulu Raotulu) కూడా పొలం కౌలుకు తీసుకోవడానికి ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపధ్యంలో తమ పొలం కౌలు ఇచ్చేందుకు ఆ యజమాని సిద్ధమైన తీసుకొనే వారి కోసం ఫ్లెక్స్(Flexi) ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరూకు చెందిన రైతు వెంకటేశ్వరరావు కి 5.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ పొలంలో సోలారు బోరు కూడా ఏర్పాటు చేశారు. అయితే వెంకటేశ్వరరావుకి కాలుకి గాయం కావడంతో వ్యవసాయం చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పొలం కౌలు కి ఇవ్వాలనుకున్నాడు. గ్రామంలో అందరికి చెప్పాడు. అయినా ఎవరూ ముందుకి రాలేదు. అయితే వ్యవసాయేతర అవసరాలకు పొలాన్ని ఇవ్వమని అడుగుతున్నారు.

వ్యవసాయేతర అవసరాలకు ఇవ్వడం ఇష్టం లేని వెంకటేశ్వరరావు సరికొత్తగా ఆలోచించారు. పొలం కౌలికిస్తాను. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి అని ఫ్లెక్స్ ఏర్పాటు చేసి ఫోన్ నెంబర్ ఇచ్చారు. గుంటూరు—పొన్నూరు రోడ్డుపై వెళ్ళే వాళ్ళు ఆ బోర్డును ఆసక్తిగా తిలకిస్తున్నారు..అన్నదాత కనుమరుగవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Reporter: T.Nagaraju, TV 9 Telugu

Also Read: Not Eat With Eggs: గుడ్లతో పాటు వీటిని కలిపి తీసుకుంటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..

Miracle Gardens: 45లక్షల రకాల పూవ్వులను చూసేందుకు రెండు కళ్లు చాలవు.. ప్రపంచంలోనే అతి పెద్ద పూదోట ఎక్కడుందో తెలుసా..