విశాఖలో ప్రజల గొంతు ఎండిపోతుంటే వాటర్ మాఫియాకు మాత్రం కాసుల పంట పండుతోంది. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చట్టాలను అధిగమించి బోర్ వెల్స్ తో భూగర్భ జలాలను తోడేస్తున్నారు. నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను పాటించడంలేదు. అపరిశుభ్రమైన నీటిని అధికధరకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. 20 రూపాయల క్యాన్ ను 35 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రజలకు ప్రాణాలను నిలబెట్టే నీటితో అక్రమ వ్యాపారం చేస్తున్నారు.