చీరాలలో ఇరువర్గాల మధ్య ఘర్షణ..

|

May 30, 2020 | 3:46 PM

నేతలు సైలెంట్‌గా ఉన్నా.. వారి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వస్తే బగ్గుమంటోంది. ప్రకాశం జిల్లా చీరాల మండలం రామాపురంలో ఉద్రిక్త చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇటీవల కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరారు. ఇప్పటికే చీరాల ఇంచార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణ మోహన్ వర్గీయులకు ఈ విషయం మిగుడు పడటం లేదు. దీంతో చీరాలలో […]

చీరాలలో ఇరువర్గాల మధ్య ఘర్షణ..
Follow us on

నేతలు సైలెంట్‌గా ఉన్నా.. వారి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వస్తే బగ్గుమంటోంది. ప్రకాశం జిల్లా చీరాల మండలం రామాపురంలో ఉద్రిక్త చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇటీవల కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరారు.

ఇప్పటికే చీరాల ఇంచార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణ మోహన్ వర్గీయులకు ఈ విషయం మిగుడు పడటం లేదు. దీంతో చీరాలలో వైసీపీ కార్యక్రమాలను విడి విడాగా నిర్వహించుకుంటున్నారు. ఇదే క్రమంలో రామాపురంలో జరిగిన చిన్న గొడవ.. ఇరువర్గాల గొడవగా మారిపోయింది. ఒకరితో ఒకరు బాహా బాహికి దిగటంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు సమయానికి అక్కడే ఉండటంతో అందరిని చెదరగొట్టారు. ఇద్దరు నేతల వ్యవహారాన్ని వైసీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది.