జగన్ మరో సంచలన నిర్ణయం.. ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ ప్రోత్సాహకం పెంపు

| Edited By:

Sep 18, 2020 | 5:32 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ఇస్తోన్న ప్రోత్సాహకాన్ని పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు

జగన్ మరో సంచలన నిర్ణయం.. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ప్రోత్సాహకం పెంపు
Follow us on

YS Jagan Key decision: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ఇస్తోన్న ప్రోత్సాహకాన్ని పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకం కింద సాధారణ ప్రసవానికి రూ.3వేలు, సిజేరిన్‌కి వెయ్యి రూపాయలు ఇచ్చేవారు. అయితే సాధారణ ప్రసవానికి రూ.5వేలు, సిజేరిన్‌కి రూ.3వేలు పెంచుతూ ఆయన ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ..  ఆసుపత్రి సేవలు అధ్వాన్నంగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని అన్నారు. రెండు వారాల్లో ఆ ఆసుపత్రుల్లో పరిస్థితి మెరుగు పడాలని అధికారులను ఆదేశించారు. ఇక ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో అన్ని నిబంధనలు పాటించాలని.. 6 నెలల తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. జిల్లాల్లో ఆరోగ్య శ్రీ కో-ఆర్డినేషన్ బాధ్యతలు ఇకపై జేసీలకి అప్పగించాలని జగన్ స్పష్టం చేశారు.

Read More:

వాటికి నేను బాధ్యుడిని కాదు.. అజిత్ ప్రకటన

10వేల ఎకరాల భూమికి నీరు.. కార్తిపై సర్వాత్రా ప్రశంసలు