10వేల ఎకరాల భూమికి నీరు.. కార్తిపై సర్వాత్రా ప్రశంసలు

రీల్ మీదే కాదు రియల్‌గానూ హీరోలుగా పేరు తెచ్చుకున్న వారిలో కోలీవుడ్ సోదరులు సూర్య-కార్తి ముందు వరుసలో ఉంటారు.

10వేల ఎకరాల భూమికి నీరు.. కార్తిపై సర్వాత్రా ప్రశంసలు
Follow us

| Edited By:

Updated on: Sep 18, 2020 | 5:36 PM

Karthi saves Farm Land: రీల్ మీదే కాదు రియల్‌గానూ హీరోలుగా పేరు తెచ్చుకున్న వారిలో కోలీవుడ్ సోదరులు సూర్య-కార్తి ముందు వరుసలో ఉంటారు. నటనలోనే కాదు సాయం చేయడంలోనూ తండ్రి శివకుమార్ అడుగు జాడల్లోనే ఈ ఇద్దరు నడుస్తున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈ ఇద్దరు ముందుకొచ్చి సాయం ప్రకటిస్తున్నారు. అంతేకాదు ఈ ఇద్దరు వేర్వేరు ఆర్గనైజేషన్లు పెట్టి పలువురికి సాయం చేస్తున్నారు.  ఈ క్రమంలో కార్తి తాజాగా 10వేల ఎకరాల భూమిని కాపాడారు.

రైతుల కోసం ఉళవన్ అనే ఫౌండేషన్‌ని స్థాపించిన కార్తి.. ఇప్పటికే వారి కోసం పలు కార్యక్రమాలను చేపట్టారు. ఇక తాజాగా 4 లక్షలను ఖర్చు చేసి ఉద్రపురం, తిరునెల్‌వెలి జిల్లాలోని సూరవల్లి కాలువను శుభ్రం చేయిస్తున్నారు. 21 రోజుల క్రితం దీనికి సంబంధించిన పనులు ప్రారంభం కాగా.. త్వరలోనే పూర్తవ్వనున్నాయి.

ఇక ఈ కాలువ వలన 10 గ్రామాల్లో దాదాపు 10వేల ఎకరాల భూమికి నీరు అందనుంది. దీంతో కార్తిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రైతులను పలు ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉంటే, కార్తి ముందుకొచ్చి వారికి సాయం చేయడం అభినందించదగ్గ విషయమని పలువురు అంటున్నారు. అయితే రైతుల కోసం కార్తి ముందుకు రావడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ పలుమార్లు వారికి అండగా నిలిచారు. ఇక పాండిరాజ్ దర్శకత్వంలో కడైకుట్టి సింహం(తెలుగులో చినబాబు) అనే మూవీలో కార్తి, రైతు పాత్రలో నటించారు. ఈ మూవీలో నటించే సమయంలో తనకు వ్యవసాయం ఆసక్తి పెరిగిందని, భూమి తీసుకొని వ్యవసాయం చేస్తానంటూ సినిమా ప్రమోషన్‌లలో వెల్లడించిన విషయం తెలిసిందే.

Read More:

9 ఏళ్ల క్రితం చిత్రం.. ఆర్యపై పరువు నష్టం దావా కేసు

Bigg Boss 4: గంగవ్వకు కరోనా పరీక్ష..!

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..