Visakha Land Scam: వంద కోట్ల విశాఖ భూ కుంభకోణంలో తొలి వికెట్.. అక్రమాలు నిర్ధారణ.. తహశీల్దార్‌ సస్పెన్షన్

విశాఖపట్నంలో వంద కోట్ల భూ కుంభకోణంలో కేసులో తొలి వికెట్ పడింది. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించారంటూ

Visakha Land Scam: వంద కోట్ల విశాఖ భూ కుంభకోణంలో తొలి వికెట్.. అక్రమాలు నిర్ధారణ.. తహశీల్దార్‌ సస్పెన్షన్
Land Scam

Updated on: Sep 08, 2021 | 8:30 PM

Visakhapatnam Rs 100 crore land scam: విశాఖపట్నంలో వంద కోట్ల భూ కుంభకోణంలో కేసులో తొలి వికెట్ పడింది. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించారంటూ విశాఖ రూరల్‌ తహశీల్దార్‌ నరసింహమూర్తిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తుమ్మల కృష్ణచౌదరికి చెందిన 12.26 ఎకరాల భూమిని తహశీల్దార్‌ నరసింహమూర్తి ఆన్‌లైన్‌ నుంచి తొలగించినట్టు గుర్తించారు. ఒకేరోజు డిజిటల్ సైన్‌ రివోక్‌, మళ్లీ పునరుద్ధరించడంతో అనుమానాలు తలెత్తాయి. కొమ్మాదిలో 100 కోట్లు విలువచేసే 12.26 ఎకరాల భూ వ్యవహారంలో సరిగా వ్యవహరించలేదని సస్పెన్షన్‌ వేటు పడింది. జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున్ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, సాగర నగరం విశాఖలో సోమవారం భారీ భూ కుంభకోణం బయటపడిన సంగతి తెలిసిందే. ల్యాండ్‌ ఓనర్ విదేశాల్లో ఉండటాన్ని అదనుసుగా చేసుకొని గ్యాంబ్లర్స్ వంద కోట్ల విలువైన భూమిని ఓ ప్రజాప్రతినిధికి అమ్మేందుకు ప్రయత్నించారు. విశాఖ అడ్డాగా జరిగిన ఈ భారీ ల్యాండ్‌ స్కామ్‌లో కీలక నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. విశాఖలో రూ. 80కోట్ల రూపాయల విలువ చేసే భూమిని యజమాని ప్రమేయం లేకుండా అమ్మాలని కొందరు ప్లాన్ వేశారు. ఇందుకోసం తప్పుడు జీపీఏ తెప్పించి…భూమిని కొనుగోలు చేసేందుకు వచ్చిన వాళ్లను మోసం చేశారు.

కొమ్మాదిలో 12.26 ఎకరాల భూమికి యజమానిగా ఉన్నారు తుమ్మల కృష్ణచౌదరి. కొద్దిరోజుల క్రితమే ల్యాండ్‌ ఓనర్‌ అమెరికాకు వెళ్లారు. అయితే ఓనర్ స్థానికంగా లేకపోవడంతో కోట్లు విలువ చేసే ఆ 12.26 ఎకరాల భూమిని పలుకుబడి ఉన్న వ్యక్తులకు కట్టబెడితే కోట్లు వచ్చిపడతాయని భావించారు గ్యాంబ్లర్స్. తుమ్మల కృష్ణచౌదరికి పరిచయమున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి.. ఇందుకు పక్కా ప్లాన్ వేశాడు. జగదీష్‌ అనే మరో వ్యక్తితో కలిసి ఏడాదిన్నర క్రితం ఇదే ల్యాండ్‌ని అమ్మేందుకు సిద్ధమయ్యారు.

Read also: Cyber Crime: అంగన్ వాడీ టీచర్లకు సైబర్ నేరగాళ్ళ వల.. ఎంత పగడ్భందీగా వ్యవహారం చేశారంటే..