మరో షాక్.. మళ్లీ పెరిగిన పాల ప్యాకెట్ల ధరలు

| Edited By:

Dec 16, 2019 | 4:03 AM

ఓ వైపు ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతుంటే.. కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో సామాన్యప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ప్రజలకు మరో షాక్‌ తగిలింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయా డైరీ.. పాల ప్యాకెట్ల ధరలను పెంచింది. లీటర్ పాలప్యాకెట్‌‌కు రూ.2 చొప్పున పెంచింది. ఈ మేరకు తెలంగాణ స్టేడ్ డైరీ డెవలప్‌మెంట్ కార్పోరేసన్ ఫెడరేషన్ (టీఎస్ డీడీసీఎఫ్) ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, పెంచిన ధరలు […]

మరో షాక్.. మళ్లీ పెరిగిన పాల ప్యాకెట్ల ధరలు
Follow us on

ఓ వైపు ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతుంటే.. కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో సామాన్యప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ప్రజలకు మరో షాక్‌ తగిలింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయా డైరీ.. పాల ప్యాకెట్ల ధరలను పెంచింది. లీటర్ పాలప్యాకెట్‌‌కు రూ.2 చొప్పున పెంచింది. ఈ మేరకు తెలంగాణ స్టేడ్ డైరీ డెవలప్‌మెంట్ కార్పోరేసన్ ఫెడరేషన్ (టీఎస్ డీడీసీఎఫ్) ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, పెంచిన ధరలు నేటి నుంచే అమలుకానున్నాయి. అయితే, స్టాండర్డ్ మిల్క్, హోల్ మిల్క్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని పేర్కొంది. సోమవారం నుంచి వెండర్ మార్జిన్ ప్రతి లీటర్ పై 25 పైసలుగా, బేస్ మార్జిన్ ధర లీటర్ కు రూ.3.25 పెంచుతున్నట్టు సంస్థ వివరించింది.

ప్రస్తుతం టోన్డ్ మిల్క్ లీటరు ధర రూ.42 ఉండగా.. ఇక ఇప్పుడు రూ.44 కానుంది. ఈ ఏడాదిలోనే విజయా డెయిరీ రెండు సార్లు ధరలను పెంచింది.