మాకే ఎందుకిలా అవుతోంది..! : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

మోదీ, కేసీఆర్ ఇద్దరూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి రైతుల పక్షాన వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నాం.. కాని కుదరలేదని ఆయన అన్నారు. ఇవాళ రాజ్ భవన్ గేటు దగ్గరకు వస్తామని చెప్పినా వినపించుకోవడం లేదని ఆయన తెలిపారు. రాష్ట్ర గవర్నర్ కు సీఎం కేసీఆర్ ని కలవడానికి కరోనా వ్యాప్తి లేదు… ప్రతిపక్ష పార్టీలు కలవడానికి కరోనా ఉందా.? అంటూ ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్ […]

మాకే ఎందుకిలా అవుతోంది..! : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Updated on: Sep 28, 2020 | 1:53 PM

మోదీ, కేసీఆర్ ఇద్దరూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి రైతుల పక్షాన వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నాం.. కాని కుదరలేదని ఆయన అన్నారు. ఇవాళ రాజ్ భవన్ గేటు దగ్గరకు వస్తామని చెప్పినా వినపించుకోవడం లేదని ఆయన తెలిపారు. రాష్ట్ర గవర్నర్ కు సీఎం కేసీఆర్ ని కలవడానికి కరోనా వ్యాప్తి లేదు… ప్రతిపక్ష పార్టీలు కలవడానికి కరోనా ఉందా.? అంటూ ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్ తెలంగాణ రైతాంగం నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారని.. దీనిపై అక్టోబర్ 2వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడుతుందని ప్రకటించారు.

వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఉత్తమ్, 18 ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నా…ఏకపక్షంగా బిల్లులు ఆమోదించుకున్నారని విమర్శించారు. ఆదాని, అంబానీ, అమెజాన్ లాంటి సంస్థలకు లాభం చేకూర్చేలా కేంద్రం నిర్ణయం ఉందని వ్యాఖ్యానించారు. పంట రుణాల మాఫీ పై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదన్న ఆయన.. పంట కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా ? అని అడిగారు. కేసీఆర్ అసమర్థత కారణంగా తెలంగాణ రైతాంగానికి క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us