సంక్రాంతి వచ్చిందంటే చాలు.. అందరి ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు దర్శనమిస్తాయి. రకరకాల ముగ్గులు వేస్తూ.. ఆ ముగ్గును అందర్నీ ఆకర్షించేలా.. రంగులు నింపి.. గొబ్బెమ్మలు పెట్టి.. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంటారు. అయితే సిరిసిల్ల మహిళలు వినూత్నంగా ముగ్గులు వేసి.. మంత్రి కేటీఆర్‌నే ఫిదా చేశారు. సంక్రాంతి సందర్భంగా రెండెకరాల స్థలంలో 200 మంది మహిళలు కలిసి కారు గుర్తును ముగ్గుగా వేసి.. అందుకు అనుగుణంగా రంగులు వేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కారు గుర్తు ముగ్గును వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం మూడు గంటల్లోనే ఈ ముగ్గును వేసి.. సరికొత్త రికార్డును సృష్టించారు. ఈ ముగ్గును వేసిన మహిళా కార్యకర్తలను మంత్రి కేటీఆర్‌తో పాటు స్థానిక టీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు అభినందించారు. ఈ కారు ముగ్గును చూసేందుకు స్థానిక పట్టణ వాసులు తండోపతండాలుగా వస్తున్నారు.