అందాలు ఒలకబోస్తోన్న తెలంగాణ “నయాగర”

| Edited By:

Jul 11, 2019 | 6:02 AM

తెలంగాణ “నయాగర”గా పేరొందిన బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. దీంతో ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతానికి సందర్శకుల తాకిడి మొదలైంది. ఛత్తీస్‌గఢ్, పెనుగోలు నల్లందేవి వాగు, పాలవాగు గుట్టలపై నుంచి వస్తున్న వరద నీరుతో.. బొగత జలపాతం అందాలు ఒలకబోస్తోంది. వరద నీటితో కళకళలాడుతూ పర్యటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. దీంతో బొగత జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. తెలంగాణ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు బొగత జలపాతాన్ని […]

అందాలు ఒలకబోస్తోన్న తెలంగాణ నయాగర
Follow us on

తెలంగాణ “నయాగర”గా పేరొందిన బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. దీంతో ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతానికి సందర్శకుల తాకిడి మొదలైంది. ఛత్తీస్‌గఢ్, పెనుగోలు నల్లందేవి వాగు, పాలవాగు గుట్టలపై నుంచి వస్తున్న వరద నీరుతో.. బొగత జలపాతం అందాలు ఒలకబోస్తోంది. వరద నీటితో కళకళలాడుతూ పర్యటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. దీంతో బొగత జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. తెలంగాణ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు బొగత జలపాతాన్ని చూడటానికి తరలివస్తున్నారు.