Visakha : ‘చంద్రబాబు అండతో కబ్జాకు గురైన రూ. 5 వేల కోట్ల విలువైన భూములు ఈ ఐదు నెలల్లో స్వాధీనం చేసుకున్నాం : అవంతి

|

Jun 14, 2021 | 8:07 PM

వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటుంటే కమ్యూనిస్టులతో సహా మిగతా పార్టీలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. దీనిపై పౌర సమాజం కూడా స్పందించాలని మంత్రి కోరారు...

Visakha : చంద్రబాబు అండతో కబ్జాకు గురైన రూ. 5 వేల కోట్ల విలువైన భూములు ఈ ఐదు నెలల్లో స్వాధీనం చేసుకున్నాం : అవంతి
Avanti Srinivas
Follow us on

Avanthi srinivas on Visakha land Grabbing : తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు అండదండలతో విశాఖ కేంద్రంగా భారీ భూ కుంభకోణమే జరిగిందన్నారు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. చంద్రబాబు హయాంలో కబ్జాలకు గురైన 430 ఎకరాల భూములు అంటే మార్కెట్ విలువ ప్రకారం రూ. 4,776 కోట్ల విలువైన భూములను వైసీపీ ప్రభుత్వం గత 5 నెలల్లో స్వాధీనం చేసుకుందని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఇంతపెద్దఎత్తున భూ ఆక్రమణలు జరిగితే.. వాటిని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటుంటే కమ్యూనిస్టులతో సహా మిగతా పార్టీలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. దీనిపై పౌర సమాజం కూడా స్పందించాలని మంత్రి కోరారు.

టీడీపీ నేతలు పెద్దఎత్తున భూకబ్జాలు, భూ కుంభకోణాలకు పాల్పడి, దాచుకోవడం-దోచుకోవడం ద్వారా వేలకోట్ల రూపాయల భూ దోపిడీ చేశారని ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) విమ‌ర్శించారు. విశాఖపట్నంలో సర్క్యూట్ హౌస్ లో సోమవారం జరిగిన విలేక‌ర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జల్-జంగిల్-జమీన్.. అని నినదించే కమ్యూనిస్టు పార్టీలు భూ ఆక్రమణలపై మాట్లాడాలన్నారు. జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, టీడీసీ సహా అన్ని పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేస్తే కక్ష సాధింపు అంటున్నారని మంత్రి అన్నారు. భూములు కబ్జా చేస్తే చర్యలు తీసుకోవడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు.

“ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిస్తున్నారు. ఆయనకు ప్రజలంతా ఒక్కటే. కులం, మతం, రాజకీయపరంగా ప్రజలను విడదీసి చూడటం లేదు. అందర్నీ సమాన దృష్టితో చూస్తున్నారు కాబట్టే, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయి. ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలకు మంచి మనసు ఉంటే మద్దతు ఇవ్వాలి. అంతేకాని గోబెల్స్‌ ప్రచారం చేయడం సరికాదు. అర చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖను పరిపాలన రాజధాని చేసి తీరుతాం.” అని అవంతి తేల్చిచెప్పారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమని ః.. విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను చెడగొట్టొద్దని మంత్రి అవంతి శ్రీనివాస్‌ టీడీపీకి హితవు పలికారు.

Read also : Mansas trust : మాన్సాస్ ట్రస్ట్ పై హైకోర్టు తీర్పు.. వేల ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలన్న దుర్మార్గపు ఆలోచనలకు అడ్డుకట్ట : చంద్రబాబు