కాళేశ్వరంపై ఫిర్యాదుల వెల్లువ.. ఒకేసారి 177 పిటిషన్ల విచారణ

| Edited By: Ravi Kiran

May 16, 2019 | 3:32 PM

నేడు తెలంగాణ హైకోర్టు చరిత్ర సృష్టించనుంది. తెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై వందల కొద్దీ ఫిర్యాదులతో ఎన్నో పిటిషన్లు హైకోర్టుకు అందగా, వాటన్నింటినీ ఒకేసారి విచారించాలని నిర్ణయించింది. ప్రాజెక్ట్‌కి వ్యతిరేకంగా దాఖలైన 177 పిటిషన్లను నేడు హైకోర్టు ధర్మాసనం విచారించనుంది. అయితే ఈ పిటిషన్లలో రైతులు, రైతు కూలీలు, ఇతరులకు పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్టు పనులను చేపట్టవద్దనేవి అధికంగా ఉన్నాయి. కాళేశ్వరం ముంపు పరిధిలోని కిష్టాపూర్‌లో పనులు చేయరాదని గతంలో సింగిల్ […]

కాళేశ్వరంపై ఫిర్యాదుల వెల్లువ.. ఒకేసారి 177 పిటిషన్ల విచారణ
Follow us on

నేడు తెలంగాణ హైకోర్టు చరిత్ర సృష్టించనుంది. తెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై వందల కొద్దీ ఫిర్యాదులతో ఎన్నో పిటిషన్లు హైకోర్టుకు అందగా, వాటన్నింటినీ ఒకేసారి విచారించాలని నిర్ణయించింది. ప్రాజెక్ట్‌కి వ్యతిరేకంగా దాఖలైన 177 పిటిషన్లను నేడు హైకోర్టు ధర్మాసనం విచారించనుంది.

అయితే ఈ పిటిషన్లలో రైతులు, రైతు కూలీలు, ఇతరులకు పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్టు పనులను చేపట్టవద్దనేవి అధికంగా ఉన్నాయి. కాళేశ్వరం ముంపు పరిధిలోని కిష్టాపూర్‌లో పనులు చేయరాదని గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కిష్టాపూర్‌తో పాటు ఇప్పుడు పలు ఇతర గ్రామాల ప్రజలు కూడా పిటిషన్‌లలో భాగం అయ్యారు. కిష్టాపూర్‌పై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అపీల్ చేయగా, దానిపైనా ఇవాళ విచారణ జరగనుంది. వీటిపై కోర్టు ఏ తీర్పునిస్తుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.