ప్రైవేట్ కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక..

|

Sep 12, 2020 | 4:49 PM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు గట్టి వార్నింగ్ ఇచ్చింది. లెక్చరర్లను తొలిగించినా, జీతాలు సరిగ్గా చెల్లించకపోయినా కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్ కాలేజీలకు హెచ్చరికలు జారీ చేసింది.

ప్రైవేట్ కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక..
Follow us on

Telangana Inter Board Warning: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు గట్టి వార్నింగ్ ఇచ్చింది. లెక్చరర్లను తొలిగించినా, జీతాలు సరిగ్గా చెల్లించకపోయినా కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్ కాలేజీలకు హెచ్చరికలు జారీ చేసింది. కాలేజీల్లో నిబంధనల మేరకు సిబ్బంది లేకపోతే.. ఆయా కళాశాలల గుర్తింపు దరఖాస్తులను తిరస్కరిస్తామని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కరోనా కాలంలో కొన్ని ప్రైవేట్ కాలేజీలు లెక్చరర్లకు సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదని.. అర్ధాంతరంగా తొలిగిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read: 

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

”ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ సప్లై.. 8 వేల జంబో జెట్‌లు అవసరం”

ఏపీ: నీట్ అభ్యర్థుల కోసం రెండు ప్రత్యేక రైళ్లు… వివరాలివే

పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…