ఉదయం వైసీపీలో చేరారు.. సాయంత్రం టీడీపీలోకి వచ్చేశారు

గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు గ్రామంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉదయం వైసీపీలో చేరిన కొందరు టీడీపీ కార్యకర్తలు, సాయంత్రం తిరిగి సొంత పార్టీలోకి వచ్చారు. వ్యక్తిగత కారణాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న తమను ఆదుకుంటామని వైసీపీ నేతలు చెప్పడంతోనే ఆ పార్టీలో చేరామని.. తీరా వారు చెప్పిన మాటలు అబద్ధమని తెలిసి మళ్లీ సొంత పార్టీలోకి వచ్చామని తెలిపారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నంబూరి శంకరరావు సమక్షంలో పార్టీలో చేరామని.. చివరకు కండువాలు వేసి భోజనాలు […]

ఉదయం వైసీపీలో చేరారు.. సాయంత్రం టీడీపీలోకి వచ్చేశారు

Edited By:

Updated on: Mar 08, 2019 | 11:01 AM

గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు గ్రామంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉదయం వైసీపీలో చేరిన కొందరు టీడీపీ కార్యకర్తలు, సాయంత్రం తిరిగి సొంత పార్టీలోకి వచ్చారు. వ్యక్తిగత కారణాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న తమను ఆదుకుంటామని వైసీపీ నేతలు చెప్పడంతోనే ఆ పార్టీలో చేరామని.. తీరా వారు చెప్పిన మాటలు అబద్ధమని తెలిసి మళ్లీ సొంత పార్టీలోకి వచ్చామని తెలిపారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నంబూరి శంకరరావు సమక్షంలో పార్టీలో చేరామని.. చివరకు కండువాలు వేసి భోజనాలు పెట్టి పంపించారని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు.