వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

| Edited By:

Aug 22, 2020 | 10:21 AM

ఏపీలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. టీడీపీ నేత, రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్‌ అధికార వైసీపీలో చేరారు

వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
Follow us on

Chandana Ramesh joins YSRCP: ఏపీలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. టీడీపీ నేత, రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్‌ అధికార వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చందన రమేష్‌ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు నాగేశ్వర్ కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా చందన రమేష్, ఆయన కుమారుడు నాగేశ్వర్‌లను జగన్‌ సాదరంగా తన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగా 2009లో కొత్తగా ఏర్పడిన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గం నుంచి చందన రమేష్ పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయకపోయినప్పటికీ.. ఆ పార్టీలోనే కొనసాగారు. ఇక గత కొన్ని రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తోన్న ఆయన, తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Read More:

చెన్నైలో భారీగా పట్టుబడ్డ ఎర్రచందనం

Bigg Boss4: ఫైనల్ అయిన కంటెస్టెంట్‌లు.. లిస్ట్‌ ఇదే!