Chandrababu Naidu: అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే పన్నులెక్కువ.. వైసీపీపై మరోసారి ధ్వజమెత్తిన చంద్రబాబు..

|

May 06, 2022 | 6:44 AM

AP Politics: దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పన్నులు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వివిధ పన్నుల భారాలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,

Chandrababu Naidu: అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే పన్నులెక్కువ.. వైసీపీపై మరోసారి ధ్వజమెత్తిన చంద్రబాబు..
Chandrababu Naidu
Follow us on

AP Politics: దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పన్నులు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వివిధ పన్నుల భారాలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి (CM YS Jagan) రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన ధ్వజమెత్తారు. బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత గురువారం విశాఖపట్నం జిల్లా తాళ్ల వలస పర్యటించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. ‘దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే పన్నులు ఎక్కువగా ఉన్నాయి.  ఇది నిజం కాకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. నేను అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిగా చేస్తాను. విశాఖను మరింత అభివృద్ధి చేస్తాను. జగన్‌ దెబ్బకు రుషికొండ బీచ్‌ కరిగిపోయింది. అదేమైనా పాకిస్తాన్‌లో ఉందా? అక్కడికి వెళ్లేందుకు పాస్‌పోర్ట్‌, వీసాలు కావాలా?’ అని చంద్రబాబు మండిపడ్డారు.

ఇక పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌ల వ్యవహారంపై కూడా టీడీపీ అధినేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ నేను ఐటీ, ఇంజినీరింగ్ విభాగాల్లో ఉన్నత ఉద్యోగాలిచ్చాను. మరీ ఈ మూడేళ్లలో జగన్ వాలంటీర్ ఉద్యోగాలు తప్ప ఏమైనా ఇచ్చారా? పదో తరగతి పేపర్లు లీక్ అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? వీటి వెనక వైసీపీ హస్తం ఉంది. పేపర్లు లీక్ అవుతుంటే మంత్రి బొత్స ఏం చేస్తున్నాడు? పేపర్లు లీక్ చేసి పరీక్షలు పెట్టడానికే ఆయన మంత్రి గా ఉన్నారా? ఇక పులివెందులలో ఫిష్ మార్ట్ పెట్టడం పూర్వజన్మ సుకృతం అని చెప్పుకున్న ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కొద్ది రోజులకు ఆ ఫిష్ మార్ట్ లో కూడా పవర్ కట్ చేశారు. ఉద్యోగాలు కూడా తీసేసారని తెలిసింది. రాష్ట్రం బాగు పడాలంటే మళ్లీ టీడీపీనే అధికారంలోకి రావాలి’ అని చెప్పుకొచ్చారు చంద్రబాబు

.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Darshanam Mogilaiah: కిన్నెర మొగిలయ్య ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రమాదంలో కూతురి మృతి..

Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ నుంచి ఆ నగరానికి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..

అందలందు ఈ అందమే వెరయ్య.. ఆకర్షించే అందంతో సురభి..