తెలంగాణ నేతన్న అద్భుతం..పట్టుచీరకు వెండికొంగు..

తెలంగాణలోని సిరిసిల్ల చేనేత వస్త్ర ఉత్పత్తులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహంతో చేనేత కార్మికులు తమ ప్రతిభను చాటుతున్నారు. ఇప్పటికే అనేక అద్భుతాలను తయారు చేసిన సిరిసిల్ల నేతన్నలు తాజాగా మరో తయారు చేసిన పట్టుచీర ఇప్పుడు దేశ విదేశాలను ఆకట్టుకుంటోంది.

తెలంగాణ నేతన్న అద్భుతం..పట్టుచీరకు వెండికొంగు..

Updated on: Jun 03, 2020 | 2:55 PM

తెలంగాణలోని సిరిసిల్ల చేనేత వస్త్ర ఉత్పత్తులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహంతో చేనేత కార్మికులు తమ ప్రతిభను చూపుతున్నారు. సిరిసిల్ల జిల్లాలోని నేతన్నలు వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే అగ్గిపెట్టెలో పట్టేంతటి చీరను తయారు చేసిన సిరిసిల్ల నేతన్నలు అంతర్జాతీయ గుర్తింపును సాధించారు.. ఎప్పటికప్పుడు విభిన్న రీతిలో పట్టు చీరలను తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు. తాజాగా మరో అద్భుతమైన పట్టుచీరను తయారు చేసి మరో మారు సిరిసిల్ల నేతన్నలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

వెండి కొంగుతో పట్టు చీరను తయారు చేశాడు సిరిసిల్ల చేనేత కార్మికుడు నల్ల విజయ్‌. ఈ చీరను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఆవిష్కరించారు. కంచిలో తయారు చేసే వెండికొంగు చీర తయారికి రెండు రోజులపాటు శ్రమించినట్లు చెప్పాడు విజయ్‌. తన తండ్రి పరందాములు చేనేతలో ఎన్నో అద్భుతాలు సృష్టించి అవార్డులు అందుకున్నాడని,ఆయన స్ఫూర్తితోనే వెండి కొంగుతో చీరను తయారు చేసినట్లు తెలిపాడు. సిరిసిల్ల ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసిన నేత కార్మికుడు నల్ల పరందాములు.

నల్ల పరందాములు 1987లోనే అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేశారు. అప్పట్లోనే ఆయన గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించాడు. అదే బాటలో పరందాములు తనయుడు విజయ్‌ కూడా విభిన్నరీతుల్లో ఆవిష్కరణ లు చేస్తున్నాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, శాలువాతోపాటు సూది రంద్రంలో, ఉంగరంలో దూరు చీరలను నేసి అబ్బురపరిచాడు. కుట్టులేకుండానే లాల్చి పైజామా, జాతీయ జెండా, మూడు కొంగులతో చీరను నేసి ఆకట్టుకున్నాడు. సిరిసిల్ల పట్టుచీరలకు బ్రాండ్‌ ఇమేజ్‌ను తెచ్చేందుకే పట్టుచీర కొంగును వెండి పోగులతో రూపొందించానని విజయ్‌ తెలిపారు. దాదాపు 250 గ్రాముల వెండిని ఉపయోగించి వెండికొంగుతో చీరను రెండు రోజుల్లోనే చేశానని తెలిపాడు.