నిండుకుండలా “సంగంబండ’ రిజర్వాయర్‌ ..దిగువకు నీటి విడుదల

కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీంతో జిల్లాల్లోని రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటున్నాయి. గత రెండు రోజులుగా కర్ణాటక ఎగువ..

నిండుకుండలా సంగంబండ రిజర్వాయర్‌ ..దిగువకు నీటి విడుదల

Updated on: Jul 20, 2020 | 6:19 PM

కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీంతో జిల్లాల్లోని రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటున్నాయి. గత రెండు రోజులుగా కర్ణాటక ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో సంగంబండ రిజర్వాయర్​ నిండుకుంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ సయ్యద్​, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మహిపాల్​రెడ్డి, ఎంపీటీసీ ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నారాయణ పేట జిల్లా మక్తల్​ మండలంలోని సంగంబండ రిజర్వాయర్​కు ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇప్పటికీ… ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. రిజర్వాయర్​ గేట్​ నంబర్​5, 7ల ద్వారా నీటిని కిందికి వదిలినట్లుగా అధికారులు తెలిపారు. వాగు పరివాహక ప్రాంతంలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాజెక్టు నీటి విడుదలతో దిగువప్రాంత ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.