Fish Ponds: విశాఖ జిల్లాలోని అనధికార రొయ్యల చెరువులపై రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల దాడులు

|

Sep 14, 2021 | 8:23 PM

విశాఖ జిల్లాలోని అనధికార రొయ్యల చెరువులపై కొరడా ఝుళిపిస్తోన్నారు రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు. పరవాడ మండలం

Fish Ponds: విశాఖ జిల్లాలోని అనధికార రొయ్యల చెరువులపై రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల దాడులు
Prawns
Follow us on

Visakhapatnam – Fish Ponds: విశాఖ జిల్లాలోని అనధికార రొయ్యల చెరువులపై కొరడా ఝుళిపిస్తున్నారు రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు. పరవాడ మండలం వాడచీపురుపల్లి పశ్చిమ రెవెన్యూ పరిధిలో అనధికారికంగా రొయ్యల చెరువులు తవ్వినట్టు గుర్తించిన అధికారులు ఇవాళ దాడులు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూమినీ ఆక్రమించి రొయ్యల చెరువుల నిర్వహణ చేస్తున్నారని గుర్తించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమంగా వెలసిన రొయ్యల చెరువులను తొలగించడం మొదలుపెట్టారు. మరో రెండు రోజుల పాటు చెరువుల తొలగింపు కార్యక్రమం కొనసాగనుంది. అటు, రొయ్యల చెరువులకు విద్యుత్ కనెక్షన్లు కూడా తొలగించారు.

టీవీ9 కథనాలతో కదిలిన అధికారులు.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు

వామ్మో ప్రభుత్వాస్పత్రి అంటూ టీవీ9లో ప్రసారమైన కథనాలకు స్పందన లభించింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసిన డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రాఘవేంద్రరావు రోగుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని క్యాజువాలిటీ బ్లాక్, ఎమర్జెన్సీ వార్డ్‌లో వైద్యం అందుతున్న తీరును పరిశీలించారు. నిర్లక్ష వైఖరి అవలంబిస్తున్న డాక్టర్లపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారాయన. ఆస్పత్రిలో పేరుకున్న స్క్రాప్‌ను వీలైనంత త్వరగా క్లియర్ చేస్తామన్నారు DME. సెక్యూరిటీ, శానిటరీ లోపాల్ని పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఇకపోతే.. విజయవాడ సర్కార్‌ దవాఖాన పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ఏపీలో కరోనా కేసులు తగ్గినా.. సాధారణ పేషెంట్లకు మాత్రం నరకం చూపిస్తున్నారు ఇక్కడి సిబ్బంది. ఉదయం వచ్చే ఔట్‌ పేషెంట్లను పట్టించుకోవడం లేదు. అటు ఇన్ పేషంట్లకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం ఎంతో మంది వైద్యం కోసం వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా చికిత్స కోసం వస్తారు. అలాంటి వారికి ఈ మధ్య కాలం లో సరైన వైద్యం అందడం లేదు. ఆస్పత్రి నిర్లక్ష్యంపై టీవీ9 నిఘా టీమ్‌ రంగంలోకి దిగింది.

వాస్తవ పరిస్థితులను గమనిస్తే.. దిమ్మదిరిగే విషయాలు బయటపడ్డాయి. గంటల తరబడి నిరీక్షిస్తున్న రోగులు టీవీ9 కంటపడ్డారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ నిరీక్షిస్తుండడం కలిచివేసింది. చిట్టీపై ఏదో ఒక మాత్ర రాసి వైద్యులు చేతులు దులుపుకుంటున్నారని ఇక్కడికి వచ్చే పేషెంట్లు చెబుతున్నారు. సమస్యల్ని ప్రస్తావిస్తూ టీవీ9 కథనాలు ప్లే చేయడంతో తాజాగా అధికార యంత్రాంగం కదిలింది.

Read also: Weather Report: కేంద్రీకృతంగా వాయుగుండం.. రాగల మూడు రోజుల వరకూ ఆంధ్రప్రదేశ్ వాతావరణ వివరాలు

Couple Arrest: మత్తెక్కించే అందాలు.. మైమరపించే చిందులు.. కన్నింగ్‌ కపుల్స్‌ చీటింగ్‌.. విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు!