కాలజ్ఞానంలో.. బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుందా..? ఆయన చెప్పినవే.. అక్కడ జరుగుతున్నాయా..? బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం.. పీల్చుకునే గాలిని సైతం.. కొనుక్కునే రోజులు వస్తాయని ఆయన చెప్పారు. నిజంగా ఇప్పుడు అందుకు ఉదాహరణే.. ఢిల్లీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఇదే కనిపిస్తోంది.
ఢిల్లీలో పొల్యూషన్ తారా స్థాయికి చేరింది. ఈ విషయంపై సాక్షాత్తూ.. సుప్రీంకోర్టునే.. ఢిల్లీ ప్రభుత్వంపై మెట్టికాయలు వేసింది. ఈ కాలుష్యం కారణంగా.. ప్రజలు తమ అమూల్యమైన జీవన కాలాన్ని కోల్పోతున్నారని, ఈ విధమైన వాతావరణంలో మనం బతకగలుగుతామా అని న్యాయ మూర్తులు అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలతో కూడిన బెంచ్.. అధికారులను ప్రశ్నించింది. అంతేకాకుండా.. ప్రస్తుతం వింటర్ సీజన్‌తో ఢిల్లీలో.. మరింత కాలుష్యం ఎక్కువవుతోంది. దీంతో.. స్కూళ్లకు కూడా.. ఢిల్లీ ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. బయటకు ఎవరు రావాలన్నా భయపడిపోతున్నారు. మొఖానికి మాస్క్ లేకుండా.. రోడ్డు మీద అడుగు పెట్టడం లేదు. అయితే.. దీన్ని క్యాష్ చేసుకుంటారు కొందరు వ్యాపారులు. స్వచ్ఛమైన గాలిని అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు.
తాజాగా.. ఢిల్లీలో.. సిటీ వాక్ మాల్, ఆక్సీ ప్యూర్, సాకేత్ తో పూర్ ఆక్సిజన్ అనే పేరిట కొన్ని ఆక్సిజన్ సెంటర్‌లు వెలిశాయి. మామూలు సాధారణ షాపింగ్‌కు వెళ్లి వచ్చినట్టు.. అక్కడికి వెళ్లి గాలి పీల్చుకుని రావచ్చని అంటున్నారు. అంతేకాదండోయ్.. ఆక్సిజన్‌లో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఎవరికి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్‌తో.. ఆక్సిజన్‌ని పీల్చుకోవచ్చని చెబుతున్నారు అక్కడి వ్యాపారులు. రూ.300 నుంచి ఈ ధర ప్రారంభం అవుతుంది. నిజంగా.. బ్రహ్మంగారు చెబుతున్నట్టే.. జరుగుతోంది.