కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులు

| Edited By:

Jan 04, 2020 | 7:52 PM

సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తోంది. దీంతో కోడి పందేల జోరు మొదలైంది. కోడి పందేలను ఆపేయాలంటూ కొంతమంది సామాజిక వేత్తలు కోర్టులను ఆశ్రయిస్తున్నా.. తమ ఆచారాన్ని వదిలేదే లేదంటున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలో కోడి పందేల ఏర్పాట్లను శరవేగంగా చేసుకుంటున్నారు. అయితే మరోవైపు కోడి పందేలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పోలీసులు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో కోడి పందేల స్థావరాలపై వారు దాడులు చేశారు. గంగాధర నెల్లూరు మండలం పెడ కంఠం పల్లి గ్రామ శివారులో […]

కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులు
Follow us on

సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తోంది. దీంతో కోడి పందేల జోరు మొదలైంది. కోడి పందేలను ఆపేయాలంటూ కొంతమంది సామాజిక వేత్తలు కోర్టులను ఆశ్రయిస్తున్నా.. తమ ఆచారాన్ని వదిలేదే లేదంటున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలో కోడి పందేల ఏర్పాట్లను శరవేగంగా చేసుకుంటున్నారు. అయితే మరోవైపు కోడి పందేలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పోలీసులు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో కోడి పందేల స్థావరాలపై వారు దాడులు చేశారు. గంగాధర నెల్లూరు మండలం పెడ కంఠం పల్లి గ్రామ శివారులో కోడిపందేలు నిర్వహిస్తున్న ఐదు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 ద్విచక్ర వాహనాలు, 5760 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే కొంతమంది పరారీ అవ్వగా.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే కోడి పందేల నేపథ్యంలో పుంజులకు గిరాకీ పెరుగుతోంది. రకాన్ని బట్టి ఒక్కో పుంజు రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు పలుకుతోంది.