Panic incident in visakhapatnam : విశాఖలో దారుణం జరిగింది. స్థానిక మిథిలాపురి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. మృతులు బంగారునాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్‌గా గుర్తించారు. అయితే, మంటల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యచేసి అగ్నిప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తుండటం సంచలనం కలిగిస్తోంది. బాధిత కుటుంబం ఒక ఎన్నారై ఫ్యామిలీ. వీళ్లు 8 నెలల క్రితమే అపార్ట్‌మెంట్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మిథిలాపురి పోలీసులు చెబుతున్నారు. ఇదిలాఉంటే, అపార్ట్ మెంట్ ఫ్లాట్ లోని పరిస్థితులు స్థానికుల అనుమానాలకు బలాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయి. ఫ్లాట్ లోని పలు చోట్ల రక్తపు మరకలు కూడా కనిపిస్తుండటం లోపల ఏదో జరిగే ఉంటుందని, ముమ్మాటికీ ప్రమాదం అయితే కాదన్న అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Read also : నిజామాబాద్, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో కరోనా తాండవం, ఆసుపత్రిల్లో బెడ్స్ ఫుల్, స్వీయ నిర్భంధంలో గ్రామాలు