ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ‘నో సోషల్ డిస్టేన్స్‌’

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇకపై భౌతిక దూరం ఉండదు. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై బస్సుల్లో సీట్ల పూర్తి సామర్థ్యం మేర ప్రయాణికులను

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇకపై నో సోషల్ డిస్టేన్స్‌

Edited By:

Updated on: Sep 23, 2020 | 10:19 AM

APSRTC bus social distance: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇకపై భౌతిక దూరం ఉండదు. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై సీట్ల పూర్తి సామర్థ్యం మేర ప్రయాణికులను అనుమతించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే కొవిడ్ నిబంధనల దృష్ట్యా బస్సుల్లో సగం సీట్లకే అందుబాటులో ఉండేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తి సామర్థ్యం మేర సీట్లు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో అన్ని సీట్లు అందుబాటులోకి వచ్చేలా ఆన్‌లైన్‌లో మార్పులు చేయనున్నారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,296 కొత్త కేసులు.. 10 మరణాలు

ఇకపై తెలుగులో అమెజాన్