రూ.2 వేల నోటుపై కొత్త ప్రకటన !

|

Mar 17, 2020 | 10:17 AM

రూ.2 వేల నోట్ల ప్రింటింగ్ నిలిచిపోయిందనే వార్తలు గత కొద్ది రోజులుగా హల్‌చల్ చేస్తున్నాయి. అయితే. తాజాగా రూ.2 వేల నోటుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది...

రూ.2 వేల నోటుపై కొత్త ప్రకటన !
Follow us on

పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేసిన తర్వాత కరెన్సీ కోసం ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడాల్సి వచ్చింది.. ఆ తర్వాత ఆర్బీఐ రూ.2 వేల నోటు తెచ్చినా ప్రజలకు చిల్లర కష్టాలు తప్పలేదు. ఆ తర్వాత కొత్త రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను తెచ్చినా పాత నోట్లను కూడా కొనసాగిస్తోంది ఆర్బీఐ. కొత్తగా రూ.2 వేలు, రూ.200 మినహా మిగతావన్నీ గతంలో ఉన్న కరెన్సీయే..ఈ క్రమంలోనే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్ నిలిచిపోయిందనే వార్తలు గత కొద్ది రోజులుగా హల్‌చల్ చేస్తున్నాయి. అయితే. తాజాగా రూ.2 వేల నోటుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘రూ.2 వేల నోట్ల ముద్రణ ఆపే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని వివరించారు. ‘రూ.2 వేల నోట్లకు చిల్లర కొరతతో వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో, రూ.500, రూ.200 నోట్లుంచేందుకు ఏటీఎంలను సిద్ధం చేయాలని ఎస్‌బీఐ, ఇండియన్‌ బ్యాంక్‌ తమ అధికారులను ఆదేశించాయి’ అని మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ వివరణ ఇచ్చారు.

read this story also: మరో కరోనా పాజిటివ్ కేసు..!