15 సెకన్లలోనే కరోనా వైరస్ అంతం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు తెలంగాణకు చెందిన మండాలి నర్సింహాచారి అనే యువ శాస్త్రవేత్త వినూత్న ఆవిష్కరణ చేశారు

15 సెకన్లలోనే కరోనా వైరస్ అంతం

Edited By:

Updated on: Sep 16, 2020 | 9:42 AM

UV Light Coronavirus: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు తెలంగాణకు చెందిన మండాలి నర్సింహాచారి అనే యువ శాస్త్రవేత్త వినూత్న ఆవిష్కరణ చేశారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌కు చెందిన నర్సింహాచారి.. ఫిలమెంట్‌ అవసరం లేని, అధిక తీక్షణతతో కూడిన అతినీలలోహిత కిరణాలు వెదజల్లే ఓ యంత్రాన్ని తయారు చేశారు. ఈ యంత్రం ఉపరితలంపై ఉన్న వైరస్‌ని కేవలం 15 సెకన్లలోనే నిర్వీర్యం చేయడం విశేషం. ఈ యంత్రాన్ని పరిశీలించిన సెంరట్‌ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ), నర్సింహాచారితో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సరుకులు, కూరగాయలు వంటివి ఈ యంత్రం సాయంతో శుభ్రం చేసుకోవచ్చునని నర్సింహాచారి తెలిపారు.

తన పరిశోధనకు తెలంగాణ స్టేట్‌ ఇన్నొవేషన్‌ సెల్‌ సహకారం అందించిందని ఆయన అన్నారు. ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌ (ఏఆర్‌సీఐ) కూడా తాను అభివృద్ధి చేసిన యూవీ పరికరం ద్వారా వెలువడే కిరణాల తీక్షణతను గుర్తించిందని నర్సింహారి చెప్పుకొచ్చారు. ఈ యూవీ పరికరం కరోనా వైరస్‌నే కాకుండా ఇతర సూక్ష్మజీవులను కూడా నిర్వీర్యం చేస్తుందని వివరించారు.

Read More:

Flash News: నాగబాబుకి కరోనా పాజిటివ్‌

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,273 కొత్త కేసులు.. 12 మరణాలు