పండుగకు వారం రోజుల ముందే బతుకమ్మ చీరలు

|

Aug 31, 2020 | 9:26 PM

బతుకమ్మ పండుగకు కనీసం వారం రోజుల ముందు నుంచే చీరల పంపిణీ ప్రారంభం కావాలని చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ చీరలు, నేతన్నల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రి సమీక్ష  నిర్వహించారు.  

పండుగకు వారం రోజుల ముందే బతుకమ్మ చీరలు
Follow us on

బతుకమ్మ పండుగకు కనీసం వారం రోజుల ముందు నుంచే చీరల పంపిణీ ప్రారంభం కావాలని చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ చీరలు, నేతన్నల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రి సమీక్ష  నిర్వహించారు.

ఇప్పటికే బతుకమ్మ చీరలకు సంబంధించిన ఉత్పత్తి దాదాపు పూర్తి కావొచ్చిందని.. వాటి పంపిణీపై దృష్టిసారించామని అధికారులు మంత్రికి  వివరించారు. అక్టోబర్‌ రెండోవారంలోపు ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి చెప్పారు. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ జరిగేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు.

కరోనా సంక్షోభ సమయంలో ‘నేతన్నకు చేయూత’ పథకానికి సంబంధించిన పొదుపు డబ్బులను గడువుకు ముందే తీసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు నేతన్నలకు ఎంతో మేలు చేకూర్చిందని కేటీఆర్‌ అన్నారు. పథకంలో భాగంగా డబ్బులు వెనక్కి తీసుకోవడం ద్వారా సుమారు రాష్ర్టంలోని 25వేల మంది నేతన్నలకు లబ్ధి చేకూరిందని  అన్నారు.

ప్రస్తుతం అనేక మంది చేనేత వస్త్రాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని, ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టెస్కో వస్త్రాలకు మరింత బ్రాండింగ్ కల్పించే ప్రయత్నాలను వెంటనే ప్రారంభించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్‌లో నలువైపులా షోరూంలను ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.