Avanthi Srinivas : గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల వేళ అధికార వైసీపీలో మంత్రి అవంతి అలక పెద్ద చర్చకే దారితీస్తోంది. గంటాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న కాశీ విశ్వనాధాన్ని పార్టీలోకి చేర్చుకోవడం అవంతికి ఇష్టం లేదని తెలుస్తోంది. దీనిపై పార్టీ పెద్దల దగ్గర చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. గంటాకు, అవంతికి ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ వచ్చింది. ఆ నేపథ్యంలోనే గంటాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న కాశీ విశ్వానాధాన్ని చేర్చుకోవద్దనే అవంతి అభిప్రాయం. కానీ… విజయసాయిరెడ్డి ఏకంగా కాశీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడంపై అవంతి అలకబూనారు. ఈ కార్యక్రమానికి కూడా రాలేదు. మరోవైపు మంత్రి అవంతితో తనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఏమీ లేవన్నారు కాశీ విశ్వనాధం. ఆయన్ను కలిసి మాట్లాడతానని చెప్పారు.