Vizag: రెండు ట్రాలీ బ్యాగులతో రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా వ్యక్తి.. వాటిల్లో ఏముందో చూసి అధికారులు షాక్

|

May 30, 2022 | 1:36 PM

పొలీసులకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. ఎవరు లగేజ్ బ్యాగ్ తీసుకెళ్తున్నా అనుమానపడాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా వైజాగ్ రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగూచూసింది.

Vizag: రెండు ట్రాలీ బ్యాగులతో రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా వ్యక్తి.. వాటిల్లో ఏముందో చూసి అధికారులు షాక్
representative image
Follow us on

AP News: ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మత్తు రవాణా మాత్రం ఆగడం లేదు. రోజూ దేశంలోని చాలా ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి పట్టుబడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక పట్టుబడే డ్రగ్స్ కేసులు ఈ స్థాయిలో ఉన్నాయంటే.. సీక్రెట్‌గా సాగుతున్న డ్రగ్స్ రవాణాను ఊహించడమే కష్టం. ముఖ్యంగా ఏపీ(AP)లో గంజాయి సాగు లేకుండా చేయడానికి ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు. మాట వినకుండా మళ్లీ సాగు చేస్తే కఠినమైన కేసులు పెడుతున్నారు. స్మగ్లర్ల బెండు తీస్తున్నారు. అయినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు ఏజెన్సీ ప్రాంతాలలో సాగుతూనే ఉంది. తాజాగా ఆదివారం విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి(ganja) పట్టుబడింది. ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (SEB) ఇన్‌స్పెక్టర్ Ch.VS ప్రసాద్ నేతృత్వంలోని అధికారులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులతో కలిసి.. రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా పార్కింగ్ స్థలాల వద్ద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే అక్కడ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతని వద్ద 2 పెద్ద ట్రాలీ బాగ్స్ ఉండటంతో.. ఇంకాస్త తేడా కొట్టింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ట్రాలీ బ్యాగులు ఓపెన్ చేయగా.. 50 కేజీల గంజాయి దొరికింది. నిందితుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో గంజాయిని కొనుగోలు చేసి రెండు ట్రాలీ బ్యాగుల్లో ప్యాక్ చేసి న్యూఢిల్లీకి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. పట్టుకున్నట్లు ఎస్‌ఈబీ అధికారులు తెలిపారు. నిందితుడు బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి.. అతనిపై కేసులు ఫైల్ చేశారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి