Visakhapatnam – Liquid Ganja: గంజాయి స్మగ్లర్లు రూటుమార్చారు. విశాఖ జిల్లాలో గంజాయిని ద్రవరూపంలోకి మార్చి తరలించేస్తున్నారు. ఇవాళ నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద తనిఖీలు చేసిన పోలీసులకు.. అనుమానాస్పదంగా ఉన్న బైక్ నుంచి కిలోన్నర లిక్విడ్ గంజాయి గుర్తించారు పోలీసులు.
లిక్విడ్ గంజాయి ఎక్కడ తయారవుతుందనే విషయంపై కూపీ లాగేసరికి.. చింతపల్లి మండలం గొప్పుగుడిసెల గ్రామ శివారులో ఓ చోట లిక్విడ్ గంజాయి తయారు చేసే పరికరాలను గుర్తించి సీజ్ చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందంటున్నారు ఏఎస్పీ మణికంఠ.
Read also: AP Weather: ఉత్తర అండమాన్ ప్రాంతములలో అల్పపీడన అవకాశం, వచ్చే రెండు రోజులకు ఏపీకి వాతావరణ సూచన